ADB: ఆదివాసీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు గొప్పవని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. భీంపూర్ మండలంలోని గిరిజాయి మాత ఆలయంలో శనివారం నిర్వహించిన జాతర కార్యక్రమంలో అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.