TG: కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పింఛను రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచాలన్నారు. ‘విద్యార్థులకు విద్యాభరోసా కార్డులు ఇవ్వాలి. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. కౌలు రైతులకు రూ.15వేలు అకౌంట్లలో వేయాలి’ అని చెప్పారు.