ముక్కులో వేలు పెట్టుకోవడం చాలా మందికి సాధారణ అలవాటుగా అనిపించినా.. ఇది ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాటు ద్వారా బ్యాక్టీరియా, వైరస్లు నేరుగా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయట. ముక్కు లోపలి భాగం దెబ్బతినడంతోపాటు.. గాయాలు ఏర్పడుతాయని సూచించారు. మెదడుపై కూడా ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.