TG: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా చెప్పారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రమాణస్వీకారంలో రేవంత్ రెడ్డి సంతకం చేసిన వీడియోను, ఉభయసభల్లో గవర్నర్తో చెప్పించిన వీడియోను కేటీఆర్ చూపించారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు రెండున్నర సంవత్సరాలు అవుతున్నా.. అమలు కాలేదని మండిపడ్డారు.