KMR: ఓంకారం నుంచే లోకం ఉద్భవించిందని కేశవ్ మహారాజ్ అన్నారు. జుక్కల్ గోవింద్ మఠం కేశవ్ మహారాజ్ శనివారం రోజు భిక్షాటన కార్యక్రమంలో భాగంగా బీర్కూర్ కోదండ రామాలయం చేరుకున్నారు. భక్తులనుద్దేశించి ప్రవచనం ఇచ్చారు. ఆయనకు మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు సాదరంగా స్వాగతం పలికారు.