KNR: కరీంనగర్లోని ఐబీ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఇండియన్ ఫార్మసీ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు మజ్జిగ, స్వీట్లు పంపిణీ చేశారు. సుమారు 100 కిలోల స్వీట్లు, 500 మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను సిబ్బంది అందజేశారు. కోవిడ్ సమయంలోనూ 24 గంటల సేవలు అందించిన ఈ సంస్థ, భవిష్యత్తులో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.