తెలంగాణను దేశంలోనే ఆయిల్ పామ్ హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు అధిక ఆదాయాన్నిచ్చే ఈ పంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో విస్తరిస్తున్నామన్నారు. ఒక్కసారి నాటితే 25-30 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం లభిస్తుందని అన్నారు. ఇది రైతుల బంగారు భవిష్యత్తుకు భరోసా అని పేర్కొన్నారు.