KNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల , 6, 8, 10 తేదీల్లో గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు రామడుగు మండల అధికారులు ప్రకటనలో తెలిపారు. 99 రోజుల ప్రణాళికలో చేసిన పనులు, పెండింగ్ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు 23 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.