GNTR: రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా కొండవీటి వాగు అభివృద్ధి పనులు, ఎన్-9, ఎన్-8, ఎన్-7 రహదారులపై నిర్మిస్తున్న వంతెనలను మంత్రి నారాయణ పరిశీలించారు. వర్షాకాలంలో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకాలు కలగకుండా బ్రిడ్జిల వద్ద పేరుకుపోయిన మట్టిని వెంటనే తొలగించాలని, ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.