JGL: కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బి. లావణ్య తెలిపారు. విద్యార్థులు ఆధార్, స్టడీ సర్టిఫికెట్, కులం, ఆదాయం, ఫోటోలు తీసుకురావాలని కోరారు. ఇంగ్లీష్ మీడియంలో ఉచిత పుస్తకాలు, యూనిఫారం, మధ్యాహ్న భోజనం, డిజిటల్ బోధన అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.