WGL: వర్ధన్నపేట మండలం అంబేద్కర్ నగర్ గ్రామ సర్పంచ్ చిట్టూరి రాజుకు ‘దళిత రత్న’ అవార్డు లభించింది. దళితుల హక్కులు, సామాజిక న్యాయం, విద్యా చైతన్యం రంగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు గురువారం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆయనను సన్మానించి అభినందించారు.అంబేద్కర్ ఆశయాల సాధన కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని రాజు తెలిపారు.