ప్రకాశం: దొనకొండ మండలంలో జలధార–జల హారతి కార్యక్రమం కింద చెరువుల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. RDT సంస్థ సహకారంతో ఎంపిక చేసిన 10 చెరువుల్లో తొలి దశగా రుద్రసముద్రం, కొచ్చర్లకోట గ్రామాల చెరువుల్లో కంప తొలగింపు పనులు చేపట్టారు. JCBలతో తవ్విన మట్టిని రైతులు స్వచ్ఛందంగా తమ పొలాలకు తరలించేందుకు ముందుకు వచ్చారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ పాల్గొన్నారు.