BPT: బాపట్ల పట్టణంలోని సూర్యలంక రహదారిపై ఉన్న బ్రిడ్జి వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.