MLG: మహబూబాబాద్ ఆర్డీవో కృష్ణవేణిని ములుగు ఆర్డీవోగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ములుగులో ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ బదిలీ కాగా, ఆయన స్థానంలో కృష్ణవేణి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం బదిలీ ఉత్తర్వులు విడుదల చేసింది.