NDL: రేపు బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఇవాళ ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ర్యాలీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. కావున కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.