సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సిగ్మా’. ఈ చిత్రంతో తమిళ స్టార్ విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాగా, ఈ సినిమాలోని మొదటి పాటను హీరో దుల్కర్ సల్మాన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపాడు.