MNCL: ప్రజల కోసమే ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. గురువారం చెన్నూర్ మండలంలోని అక్కపల్లి గ్రామంలో జరిగిన వార్డు సభకు హాజరై మాట్లాడారు. ఘన వ్యర్థాల నిర్వహణపై గ్రామస్తులు అవగాహన కలిగి ఉండాలని, ఇంటి వద్దనే వ్యర్థాలను పొడి, తడి వ్యర్థాలను వేరు చేసి పరిశుభ్రత నెలకొల్పాలని సూచించారు.