ASF: ఆసిఫాబాద్ DSP అశోక్ ఆధ్వర్యంలో సిర్పూర్ మండలం మహాగావ్ గ్రామంలో గురువారం పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారి వద్ద నుంచి రూ.39 వేల నగదు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ అశోక్ వెల్లడించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.