VSP: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటిని బాధ్యతగా వినియోగించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం పిలుపునిచ్చారు. నగరానికి రోజుకు 400 MLD నీటి అవసరం ఉండగా, 2047 నాటికి 726 MLDకు పెరుగుతుందని తెలిపారు. వాటర్ సెక్యూరిటీ ప్లాన్, డ్రింక్ ఫ్రం ట్యాప్ పథకాలతో సరఫరా మెరుగుపరుస్తున్నామన్నారు. నీటి సంరక్షణలో ప్రజలు సహకరించాలని కోరారు.