JGL: కోడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మాడి రాజశేఖర్-ఉమారాణి దంపతుల కుమారుడు ముమ్మాడి రాజసింహ గురువారం వెలువడిన గేట్ ఫలితాలలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో ఆల్ ఇండియా స్థాయిలో 57వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటాడు. ముమ్మాడి రాజసింహ ప్రస్తుతం కేరళలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువు పూర్తి చేస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.