TG: వేములవాడను టెంపుల్ సిటీ, టూరిజం హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. తిప్పాపూర్‌లో మూడో బ్రిడ్జి స్లాబ్ పనులను ప్రారంభించిన ఆయన, గత ప్రభుత్వం కేవలం శిలాఫలకాలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే బ్రిడ్జి భూసేకరణకు రూ.6.97 కోట్లు మంజూరు చేశామన్నారు.