TG: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో 38 నిబంధనలు అమలు చేసే వరకు బదిలీ ఆప్షన్ ఫామ్లు సమర్పించకూడదని నిర్ణయించింది. బదిలీల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేసింది. స్పౌస్ కేటగిరి నిబంధనలను అమలు చేయాలని కోరింది. వైద్యులు కోరుకున్న పోస్టింగ్లను మంజూరు చేయాలని తెలిపింది. లేదంటే వైద్య సేవలు నిలిపివేస్తామని హెచ్చరించింది.