TG: ప్రాజెక్టుల పనుల్లో ఎలాంటి పురోగతి లేదని ఎంపీ డీకే అరుణ తెలిపారు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం లేదని పేర్కొన్నారు. వెంటనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పబ్లిసిటీ, పాపులారిటీ కోసం తప్ప సీఎం రేవంత్‌కు అభివృద్ధిపై శ్రద్ధ లేదని విమర్శించారు. గద్వాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిందేమీలేదని చెప్పారు.