VZM: బొబ్బిలి పట్టణంలోని పలు హోటల్స్‌లో ఇవాళ విజలెన్స్ అధికారులు ఆక్షస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా వినియోగిస్తున్న 13 డొమస్టిక్ సిలెండర్లను సీజ్ చేసి, గ్యాస్ గోడౌన్‌కు తరలించారు. అక్రమ గ్యాస్ వినియోగాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజిలెన్స్ అధికారులు సింహాచలం, సతీష్ కుమార్, CSDT సాయికృష్ణ సంయుక్తంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు.