అడవికి రాజైన సింహం నిద్రిస్తుండగా ఒక ఎలుక దానిపై ఆడుకుంటూ నిద్రలేపింది. కోపంతో సింహం ఆ ఎలుకను చంపబోతుంటే.. ‘నన్ను వదిలేయండి, ఏదో ఒకరోజు మీకు సహాయం చేస్తాను’ అని ఎలుక వేడుకుంది. సింహం నవ్వి దానిని వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాడి వలలో చిక్కుకుంది. ఆ ఎలుక వచ్చి తన పదునైన పళ్లతో వలను కొరికి సింహాన్ని కాపాడింది. నీతి: మనం చేసే చిన్న మేలు వృధా పోదు.