E.G: తాళ్లపూడిలోని కరిబండి డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. APSSDC సహకారంతో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తారని అన్నారు. అర్హత గల అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరుకావాలని సూచించారు.