BPT: వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన సీఎం, అధికారులు అందిస్తున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.