TG: సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో 8 ఏళ్ల లోపు చిన్నారులకు సైకిళ్ల పంపిణీ జోరుగా సాగుతోంది. తాజాగా మరో 70 మందికి సైకిళ్లు అందించడంతో ఇప్పటివరకు మొత్తం 400 సైకిళ్ల పంపిణీ పూర్తయింది. ఆధార్ జిరాక్స్ ఇచ్చి పేరు నమోదు చేసుకున్న వారందరికీ విడతల వారీగా అందిస్తామన్నారు. మరో 156 మందికి టోకెన్లు ఇచ్చి, వచ్చే ఆదివారం సైకిళ్లు ఇస్తామని జగ్గారెడ్డి తెలిపారు.