MNCL: లక్షెట్టిపేట మండలంలోని రంగపేటలో గాలివాన బీభత్సానికి ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం సాయంత్రం రంగపేట గ్రామంలో ఈదురు గాలులతో వర్షం పడింది. దీంతో ఆ గ్రామానికి చెందిన దేవుమ్మ (70)పై ఇంటి రేకులు పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను వైద్య చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.