VZM: బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా పెదమానాపురం నుంచి విశాఖపట్నం ఆటోలో తరలిస్తున్న సుమారు 300కిలోల గో మాంసాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్సై యు. మహేష్ తెలిపారు. తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, కోర్టుకు తరలించినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు గొయ్యిలో పాతి పెట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.