AP: సొంతపార్టీ కార్యకర్తపైనే కావలి TDP MLA కృష్ణారెడ్డి చేయిచేసుకున్నారు. పేపాలవారిపాలెంలో RO ప్లాంటు నిర్వహణ సరిగా లేదని, ఆ ప్రాంత TDP కార్యకర్తలు, గ్రామస్థులు MLA ఇంటికి వచ్చి ఫిర్యాదు చేశారు. 4 రోజులుగా నీరు రాకున్నా ప్లాంట్ యజమాని స్పందించడం లేదని, పార్టీలో మొదటి నుంచీ ఉన్నవారిని పట్టించుకోకుండా ఇతరులకు ఎలా ఇస్తారని కార్యకర్త ప్రశ్నించగా.. MLA ఆగ్రహంతో చేయిచేసుకున్నారు.