NZB: కమ్మర్పల్లి మండలం చౌటుపల్లి పీఎంస్రీ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం మే 11 నుంచి మే 25 వరకు 15 రోజులపాటు ఈ శిక్షణ తరగతులు నిర్వహించినట్లు మండల విద్యావనరుల అధికారి ఎన్. ఆంధ్రయ్య తెలిపారు.