శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ Dr. ఆర్. వినో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థుల నుంచి ఈనెల 26వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.