IPL 2026 ఉత్కంఠభరిత ప్లే ఆఫ్స్ సమరానికి తెరలేచింది. రేపు ధర్మశాల వేదికగా జరిగే తొలి క్వాలిఫయర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఫైనల్ బెర్త్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడటం ఖాయంగా కనిపిస్తోంది.