అన్నమయ్య: జిల్లాలో వర్షపు నీటిని సమర్థంగా వినియోగించి జల వనరుల పెంపుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల నింపుదలతో పాటు ట్యాంక్ టు ట్యాంక్ కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.