MLG: రైతులకు 50% సబ్సిడీపై జీలుగు (పచ్చిరొట్ట) విత్తనాల పంపిణీ ప్రారంభమైనట్లు సోమవారం ఆత్మ ములుగు ఛైర్మన్ రవీందర్ రెడ్డి తెలిపారు. మల్లంపల్లి రైతు ఆగ్రోస్లో 167 బస్తాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 30 కిలోల బస్తా అసలు ధర రూ.4905 కాగా, రాయితీపై రూ.2452.50కే లభిస్తుందని, ఒక బస్తా రెండున్నర ఎకరాలకు సరిపోతుందని తెలిపారు. దీనిని రైతులు వినియోగించుకోవాలని కోరారు.