KNR: శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామ యువకుడు కన్నం సుమిత్ ఎంటెక్ చదువుతూనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. సామాన్య కుటుంబంలో పుట్టి చదువుపై మక్కువతో కష్టపడి చదివి గ్రూప్ స్థాయి ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.