GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్ IPL 2026 సీజన్లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే 6 హాఫ్ సెంచరీలు చేసిన గిల్.. తాజాగా RRతో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లోనూ మరో అర్ధ శతకంతో చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో అతడు ఈ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ ఐపీఎల్ కెరీర్లో ఇది 33వ అర్ధ శతకం కావడం విశేషం.