నల్గొండలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీధి కుక్క పిల్లల దత్తత కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 64 మంది జంతు ప్రేమికులకు కుక్క పిల్లలను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విశ్వాసపాత్రమైన కుక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.