ADB: గాదిగూడ మండలంలోని పీవీటీజీ ఆదివాసీల పరిస్థితి దయనీయంగా మారింది. విద్య, ఉపాధిపై అవగాహన లేక అడవుల్లో కట్టెలు సేకరించి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఐటీడీఏ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వారికి చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అవగాహన కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.