RRతో జరుగుతున్న క్వాలిఫయర్-2లో GT ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. గిల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో సుదర్శన్ ప్రస్తుత IPL సీజన్లో 700 పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. వీరిద్దరి ధాటికి GT(11 ఓవర్లలో 144/0) స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది.