MBNR: జడ్చర్ల పట్టణంలోని బీ.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో PM ఖేల్ మహోత్సవం గురువారం ఘనంగా ప్రారంభమైంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యమని క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.