ELR: కొయ్యలగూడెం మండల కేంద్రానికి మంజూరు అయిన అగ్ని ప్రమాదక కేంద్రాన్ని పట్టణంలోనే నిర్మించాలని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం పలువురు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అగ్నిప్రమాద కేంద్రం ఎన్నో పోరాటాల వలన మంజూరు అయిందని దానిని ఊరికి దూరంగా నిర్మించడం వలన ఉపయోగం ఉండదని తెలిపారు. అధికారులు స్పందించి స్థానికంగా ఉండేలా చూడాలన్నారు.