వనపర్తి కొత్త బస్టాండ్ ప్రధాన రహదారిపై ఉన్న పార్టిషన్ గోడ కూలే పరిస్థితిలో ఉండటంతో బాటసారులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు విస్తరణలో షాపులు తొలగించినా గోడలను తొలగించకపోవడంతో అవి ప్రమాదకరంగా ఉన్నాయి. అదనంగా మురుగు కాలువలపై మ్యానుహోల్స్ ధ్వంసమై ప్రమాదం పెరుగుతోంది. ప్రమాదం జరుగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.