తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ గుర్తించి గౌరవించడమే లక్ష్యమని కమిటీ ఛైర్మన్ కే కేశవరావు స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన కమిటీ తొలి సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు. అమరవీరుల కుటుంబాలు, జైలుకు వెళ్లిన వారు, కేసులైన వారి వివరాలను పారదర్శకంగా సేకరించాలని ఆదేశించారు. జూన్ 4న దీనిపై అఖిలపక్ష సమావేశం జరగనుంది.