కోయిలకొండ మండల ఎస్సై తిరుపాజి బదిలీ అయ్యారు. ఆయనను వీఆర్‌కు అటాచ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఎస్ఐ తిరుపాజిపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సూరారం, లింగాల చెడు వాగుల నుంచి అక్రమంగా తీసుకొని తరలిస్తున్నారంటూ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాలలో వార్తలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది.