NZB: కమ్మర్పల్లి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అందించేందుకు పాఠ్యపుస్తకాలు శనివారం మండలానికి చేరుకున్నాయని మండల విద్యా వనరుల అధికారి (ఎంఈవో) ఎన్. ఆంధ్రయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికే ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు అందేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోందని చెప్పారు.