ప్రకాశం: ఒంగోలు మండలం గుండాయపాలెం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 20 మందిని శనివారం స్థానిక టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.17,350 నగదు 13 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించామని సీఐ భీమా నాయక్ తెలిపారు. పేకాట ఆడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.