AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలకు, పాలనకు ఏమాత్రం సంబంధం లేదని YCP నేత పోతిన మహేష్ విమర్శించారు. పవన్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ఆడబిడ్డల గురించి మాట్లాడే హక్కు జనసేన అధినేతకు లేదన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన జానీ మాస్టర్, అరవ శ్రీధర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.