ఓ అమెరికన్ జంట భారతదేశంలో 30 రోజులపాటు 13 నగరాలను సందర్శించినట్లు ఇన్స్టాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ టూర్ కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు ఆ జంట వెల్లడించింది. తమ ట్రిప్లో ట్రాన్స్పోర్ట్ కోసమే ఎక్కువగా ఖర్చయిందని తెలిపారు. తాము ప్రీమియం అనుభూతులకు ప్రాధాన్యత ఇవ్వడమే ఈ ఖర్చుకు కారణమని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.